Home / Gujarat
సూరత్‌లోని కతర్గామ్ ప్రాంతంలో గణపతి ఆకారంలో ఉన్న వజ్రం ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి అట్రాక్షన్ గా నిలుస్తుంది. 500 కోట్ల రూపాయల విలువైన ఈ 27 క్యారెట్ల వజ్రాన్ని 16 సంవత్సరాల క్రితం పాండవ్ కుటుంబీకులు కనుగొన్నారు.
ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన గుజారాత్‌లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతి పై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు విషయాల్లోకి వెళ్తే గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా మృతి చెందారు.
కుక్కలను ప్రేమించే వారు, ఇష్టపడని వారు తక్కువే. ఎందుకంటే కుక్క విశ్వాసపాత్రమైన జంతువు. అందుకు పలువురు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరి గుజరాత్ లోని ఒక గ్రామంలో అయితే వీధి కుక్కలకు కోట్లాది రూపాయల భూమిని కేటాయించి మరీ సాకుతున్నారు.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్‌లో పేర్కొన్నారు.
గుజరాత్‌కు చెందిన తన్వీ, హిమాన్షు పటేల్ దంపతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు తమ కార్పొరేట్ వృత్తిని స్వచ్ఛందంగా వదిలేసారు. తమ వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్న రైతు దానిపై రసాయనాలు పిచికారీ చేశాడని తెలుసుకున్న వారు తమ వృత్తులను విడిచిపెట్టారు.
గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఓ చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి.. అక్కడి కూలీలు, యువకులకు రోజు కూలీ ఇచ్చి క్రికెట్ ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి ఐదు హెచ్డీ కెమెరాలను కూడా ఉపయోగించారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.