Home / Gujarat
గుజరాత్ ఎన్నికల సందర్భంగా పారిపోయిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్‌లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన బయటకు వచ్చారు.
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్ ప్రారంభమైంది . నేడు 89 నియోజకవర్గాల ప్రజలు 788 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వదోదర నగర శివార్లలోని ఒక తయారీ యూనిట్‌పై దాడి చేసి దాదాపు రూ. 500 కోట్ల విలువైన నిషేధిత ఎండి డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది.
అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి విధ్వసం సృష్టించారు. సీనియర్ నాయకుడు భరత్‌సింగ్ సోలంకీ పోస్టర్లను తగులబెట్టారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్రచారానికి వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కు షాక్ తగిలింది. ఆయన ప్రచారసభలో ముస్లిం యువకులు ఆయన వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేసారు.
గుజరాత్‌లోని గాంధీనగర్ మరియు మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన తరహాలోనే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అదే ఓవైసీపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై రాళ్ల దాడి చేశారు.