Last Updated:

Amit Shah: కలలను అమ్మేవారిని గుజరాతీలు నమ్మరు

కలలు అమ్మేవారిని గుజరాతీలు గెలిపించరని పరోక్షంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్ధేశించి అన్నారు

Amit Shah: కలలను అమ్మేవారిని గుజరాతీలు నమ్మరు

New Delhi: గుజరాత్‌లో మరోసారి బీజేపీ గెలిచి తీరుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారంనాడు గాంధీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో అమిత్‌షా ప్రసంగించారు. భూపేంద్ర పటేల్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

గుజరాత్ ప్రజల గురించి తనకు బాగా తెలుసునని పనిచేసే వారినే గుజరాతీలు నమ్ముతారని అమిత్‌షా అన్నారు. ఆ కారణంగానే ప్రజలు బీజేపీ వైపే ఉంటారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం భూపేంద్ర సింగ్ నాయకత్వంలో బీజేపీ మరోసారి మూడింట రెండు వంతుల మెజారిటీలో గెలుచి తీరుతుందని అమిత్‌షా అన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి: