Home / Gujarat
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వడోదర విమానాశ్రయంలో 'మోదీ, మోదీ' నినాదాలతో కొందరు స్వాగతం పలికారు. అయితే కేజ్రీవాల్ దీనిపై పెద్దగా స్పందించకుండా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.
నిరసన కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాల్లో విచారణ చేపట్టిన సర్వోత్తమ న్యాయస్ధానం పలువురికి జైలు శిక్షలు విధించిన ఘటన అహ్మాదాబాద్ లో చోటుచేసుకొనింది
వేదాంత లిమిటెడ్ మరియు తైవాన్ సెమీకండక్టర్ దిగ్గజం ఫాక్స్‌కాన్ గుజరాత్లో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి $19.5 బిలియన్ (రూ.1.54 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి.
అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు.. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా... బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
కలలు అమ్మేవారిని గుజరాతీలు గెలిపించరని పరోక్షంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్ధేశించి అన్నారు
ఆప్ అంటే "అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ" అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత అజోయ్కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్న ఆప్‌ని అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ, అరవింద్ యాక్టర్స్ పార్టీ, అరవింద్ ఐష్ పార్టీ అని పిలవాలని అన్నారు.
అహ్మదాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ పర్యటనలో ఊహించని ఆహ్వానం ఎదురయింది. అహ్మదాబాద్‌లో ఆటో రిక్షా డ్రైవర్ల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు, వారిలో ఒక ఆటోడ్రైవర్ కేజర్ీవాల్ ను డిన్నర్ కు ఆహ్వానించారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను రూపొందించి, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టారని తీస్తా సెతల్వాద్‌పై ఆరోపణలు ఉన్నాయి.