Home / govt jobs
TREIRB: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 9,231 పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో నిరుద్యోగుల కల సాకారం కానుంది. వరుస పెట్టి నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఈ వార్తతో ఉద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త. పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి చర్యలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారా అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. నిరుద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఏజెంట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది.
అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖలో 134 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 11 జాయింట్ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది.