Home / Educational News
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR-UGC NET) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు CSIR UGC NET 2022 దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్సైట్ csirnet.nta.nic.in ద్వారా జూలై 11, 2022 నుండి పూరించవచ్చు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 జూలై 17న జరుగుతుంది, నిరసనలు ఉన్నప్పటికీ, అధికారులు పరీక్ష తేదీలను మార్చలేదు. మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం నమోదు చేసుకున్న 18 లక్షల మంది విద్యార్థులు ఒకే సమయంలో పెన్ మరియు పేపర్ విధానంలో పరీక్ష రాయనున్నారు. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పరీక్ష.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలనేపధ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ తో ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను విడుదల చేశారు.