Home / economic crisis
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న క్యూబా ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలను ఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితో లీటర్ పెట్రోల్ ధర 25 పెసోల నుండి 132 పెసోలకు పెరుగుతుంది. ఈ చర్య దాని లోటును తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది, అయితే ఇది నగదు కొరతతో ఉన్న క్యూబన్లకు జీవితాన్ని మరింత కష్టతరం చేసే అవకాశముంది.
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదయింది.
Petrol Price: పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంగా.. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా 35 రూపాయలను పెంచేశారు. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులతో హత్య చేయించడానికి.. ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తనను హత్య చేసేందుకు.. ఉగ్రవాద సంస్థకు భారీగా నగదు అందించినట్లు మీడియాకు వెల్లడించారు.
Pakistan Crisis: పాకిస్థాన్ లో ఆహార కొరత రోజురోజులు తీవ్రం అవుతుంది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని.. ఆహార కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఒక గోధుమ పిండి బ్యాగ్ కోసం వారు చేస్తున్న సాహాసాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాజాగా గోధుమ పిండి కోసం ఓ ట్రక్ వెంటా పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing […]
26 ఏళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టిన బాబా వంగా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగా ఊహించి జోస్యం చెప్పడంలో బాగా పేరు తెచ్చుకున్నారు. ఆమె 9/11 ఉగ్రవాద దాడులు మరియు బ్రెగ్జిట్ వంటి ప్రధాన సంఘటనలను ఆమె అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి.
మన దేశంలో కొన్ని రాష్ట్రాలు శ్రీలంక బాటలో పయనించనున్నాయా? ఎందుకంటే ఆయా రాష్ర్టాల రెవెన్యూలో పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. ఉదాహరణకు పంజాబ్‌నే తీసుకొంటే రెవెన్యూలో 21.3 శాతం, తమిళనాడు 21 శాతం, పశ్చిమ బెంగాల్ 20.8 శాతం, హర్యానా 20.9 శాతం వడ్డీలు చెల్లిస్తున్నాయి. ఆదాయంలో 20 శాతంపైనే వడ్డీలు చెల్లిస్తూపోతే ....రాష్ట్రాలు ఆర్థికంగా చతికిలపడటం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలంకలో పాలకుల నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది. దేశాన్ని దోచుకుపోయిన గొటబాయ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుండగా శ్రీలంక సామాన్యుడికి మాత్రం పూటగడవడం కూడా కష్టమైపోయింది. లంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి.
వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.