Pakistan’s Economic crisis: తీవ్రమవుతున్న పాకిస్తాన్ ఆర్దిక సంక్షోభం.. ఆకాశాన్నంటుతున్న ఉల్లిపాయలు, గోధుమపిండి ధరలు
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదయింది.
Pakistan’s Economic crisis:పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదయింది. పాకిస్థాన్‌లో ఉల్లిపాయల ధరలు 228.28 శాతం, సిగరెట్‌లు 165.88 శాతం, గోధుమ పిండి ధర 120.66 శాతం, క్యూ1లో గ్యాస్ ఛార్జీలు 108.38 శాతం, లిప్టన్ టీ ధర 94.60 శాతం మేర పెరిగాయి. అదేవిధంగా డీజిల్ ధర 102.84 శాతం, అరటిపండ్లు 89.84 శాతం, పెట్రోల్ 81.17 శాతం, గుడ్లు 79.56 శాతం పెరిగాయి.
ప్రతిపాదిత ఇంధన ధరల పథకం పరిష్కారమైన తర్వాత పాకిస్తాన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రెండూ 1.1 బిలియన్ డాలర్ల రుణం కోసం ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంపన్న వినియోగదారుల నుండి ఇంధనం కోసం ఎక్కువ వసూలు చేస్తామని తెలిపారు. సేకరించిన డబ్బును పేదలకు సబ్సిడీ ధరలకు ఉపయోగించబడుతుంది.ఇంధన ధరల ప్రణాళికను రూపొందించేందుకు తమ ప్రభుత్వానికి ఆరు వారాల గడువు ఇచ్చామని పాకిస్థాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ తెలిపారు.
గోధుమపిండి పంపిణీ కేంద్రాలవద్ద తొక్కిసలాట..( Pakistan’s Economic crisis)
పాకిస్థానీయులు దాదాపు రోజు వారి కొనుగోలు శక్తిని కోల్పోతున్నారని సంఖ్యలు సూచిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, వారు కేవలం ఒక రోజు ముందు కంటే తక్కువ ఆహారాన్ని కొనుగోలు చేయగలరు.నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ-ఆదాయ కుటుంబాల భారాన్ని తగ్గించడానికి, ప్రాంతీయ ప్రభుత్వాలు రంజాన్‌లో గోధుమపిండి సంచులను పంపిణీ చేయడానికి ప్రణాళికలను ప్రకటించాయి. కానీ ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరిగాయి. మరోవైపు చిల్లర వ్యాపారులు సరుకులను నిల్వ చేయడం, అధిక రేట్లకు అమ్మడం ద్వారా తమ క్రూరమైన వైఖరిని కొనసాగిస్తున్నారు.
అత్యంత కఠినమైన రంజాన్..
రంజాన్సంప్రదాయాలలో సెహ్రీ మరియు ఇఫ్తార్ వంటి వాటి కారణంగా ధరల పెరుగుదల సామాన్యులకు ఇబ్బందిగా మారింది.పరిపాలనా యంత్రాంగం వివిధ వస్తువులకు అధికారిక ధరల జాబితాలను జారీ చేసినప్పటికీ, దుకాణ యజమానులు వారి ఇష్టాలు మరియు కోరికల ఆధారంగా వారి స్వంత ధరలను నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత పాకిస్తాన్ యువతరానికి వారి మొత్తం జీవితంలో అనుభవించిన అత్యంత కఠినమైన రంజాన్ ఇదే కావచ్చని అంటున్నారు.
పాకిస్తాన్ తీవ్రఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపధ్యంలో పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సియాల్‌కోట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ దివాళా తీసిందని అన్నారు.పాకిస్థాన్ దివాళా తీస్తోందని లేదా లేదా మాంద్యం జరుగుతోందని మీరు విన్నారు. ఇదిఇప్పటికే జరిగింది. మనం దివాళా తీసిన దేశంలో జీవిస్తున్నామని ఆసిఫ్ చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి బ్యూరోక్రసీ మరియు రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు. పాకిస్థాన్ సుస్థిరత సాధించాలంటే తన కాళ్లపై తాను నిలబడటం చాలా కీలకమని అన్నారు.మన సమస్యలకు పరిష్కారం దేశంలోనే ఉందని, పాకిస్థాన్ సమస్యలకు ఐఎంఎఫ్ వద్ద పరిష్కారం లేదని ఆయన అన్నారు.