Home / Death Toll
కెన్యాలో మంగళవారం జరిగిన నిరసనల్లో కనీసం 13 మంది మరణించారని ఆ దేశ ప్రధాన వైద్యుల సంఘం అధికారి తెలిపారు.నైరోబీ మరియు దేశంలోని ఇతర నగరాల్లో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల మధ్య కెన్యా పార్లమెంటు మంగళవారం పన్నులను పెంచే వివాదాస్పద ఆర్థిక బిల్లును ఆమోదించింది.
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఖాన్ యూనిస్‌లో హమాస్‌పై దాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు నాజర్, అల్-అమల్ ఆసుపత్రుల లోపల మరియు చుట్టుపక్కల నుండి పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఇలోన్ లెవీ చెప్పారు.
జపాన్‌లో న్యూ ఇయర్ రోజున దేశం యొక్క పశ్చిమ తీరాన్ని తాకిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య గురువారం 73కి పెరిగింది. కూలిపోయిన భవనాల క్రింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సుమారుగా పదివేల మంది సహాయం కోసం వేచి ఉన్నారు.
సోమాలియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో మరణించిన వారి సంఖ్య 96కి చేరుకుందని రాష్ట్ర వార్తా సంస్థ సోన్నా శనివారం తెలిపింది. సోమాలియా వరద మృతుల సంఖ్య 96కి చేరుకుందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు,ఈ సంఖ్యను ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి మహముద్ మోఅల్లిమ్ ధృవీకరించారు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.
ఇజ్రాయెల్ ,పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. గాజాలో సుమారుగా 413 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపం మృతుల సంఖ్య 2,400 కు పైగా దాటిందని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ తెలిపారు. ఈ భూకంపం కారణంగా సుమారుగా 2,445 మంది మరణించారని, 1,320 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. హెరాత్‌లోని జిందా జన్ జిల్లాలోని 13 గ్రామాలలో భూకంప బాధితులు ఎక్కువగా ఉన్నారని సైక్ తెలిపా
వరదల బారిన పడిన సిక్కిం రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 కు చేరినట్లు అధికారులు ధృవీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు మొత్తం 29 మృతదేహాలను వెలికితీసినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ అనిల్‌రాజ్ రాయ్ తెలిపారు.
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్దంలో రెండింటిలోనూ సుమారు 500 మందికి పైగా మరణించారు. తాజా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 300 మందికి పైగా మరణించారు.