Last Updated:

Israel-Hamas conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..500 దాటిన మృతుల సంఖ్య

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్దంలో రెండింటిలోనూ సుమారు 500 మందికి పైగా మరణించారు. తాజా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 300 మందికి పైగా మరణించారు.

Israel-Hamas conflict: ఇజ్రాయెల్-హమాస్  యుద్ధం..500 దాటిన మృతుల సంఖ్య

Israel-Hamas conflict: ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్దంలో రెండింటిలోనూ సుమారు 500 మందికి పైగా మరణించారు. తాజా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ప్రతీకార సైనిక చర్య, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రారంభించిన ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ కారణంగా గాజాలో 230 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో ఇజ్రాయెల్ సైన్యం మరియు హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర పోరు ఇంకా కొనసాగుతోంది..గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడి ఆదివారం ఉదయం వరకు కూడా కొనసాగింది.

పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన అతిపెద్ద దాడిలో ఇజ్రాయెల్‌లో 1,600 మందికి పైగా గాయపడ్డారు.ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్‌తో గాజాలో 1,700 మంది గాయపడ్డారు.గాజాపై భారీ ఎత్తున ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. జనసాంద్రత కలిగిన గాజా నగరం మరియు అనేక ఇతర ప్రదేశాలలో రాత్రిపూట బాంబు దాడులు జరిగాయి.ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా స్ట్రిప్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గాజా స్ట్రిప్‌కు శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఇజ్రాయెల్ విద్యుత్ కంపెనీని ఆదేశించినట్లు ఇంధన మంత్రి తెలిపారు.

ఇజ్రాయెల్‌కు 8 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీ..(Israel-Hamas conflict)

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం దేశం సుదీర్ఘమైన మరియు కష్టతరమైన యుద్ధాన్ని ప్రారంభిస్తోందని లక్ష్యాలను సాధించే వరకు ఇది కొనసాగుతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు 8 బిలియన్ డాలర్ల విలువైన అత్యవసర సైనిక సహాయ ప్యాకేజీని ఆమోదించారు. బైడెన్ శనివారం నెతన్యాహుతో మాట్లాడాడు మరియు ఇజ్రాయెల్ యొక్క ఆత్మ రక్షణ హక్కు కోసం తన పూర్తి మద్దతును ప్రకటించారు. నెతన్యాహు బైడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్‌పై దాడి పాలస్తీనియన్ల ఆత్మ రక్షణ చర్య అని చెప్పడం ద్వారా హమాస్ గ్రూపుకు మద్దతు ఇచ్చింది. ముస్లిం దేశాలు వారి హక్కులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. హమాస్ చర్యను గర్వించదగిన చర్య గా పేర్కొంటూ ఇరాన్‌లో వేడుకలు జరిగాయి. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం మరియు పాలస్తీనాలోని భారత ప్రతినిధి కార్యాలయం సంబంధిత దేశాల్లోని భారతీయ పౌరులను అప్రమత్తంగా ఉండాలి కోరాయి.