Home / Death Toll
లిబియాను వణికించిన డేనియల్ తుఫానుతో మృతిచెందిన వారి సంఖ్య సుమారు ఐదు వేలకు చేరింది. పది వేలమంది వరకు ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. లిబియాకు తూర్పు తీర ప్రాంతం నగరమైన డెర్నాలో నాలుగోవంతు నగరం తుడిచిపెట్టుకుపోయింది.
: మొరాకోలో సంభవించిన ఘోరమైన భూకంపం లో మృతుల సంఖ్య 2,000 దాటిందని అధికారులు తెలిపారు, బాధితులు ఇప్పటికీ చిక్కుకున్నారని భయపడుతున్న మారుమూల పర్వత గ్రామాలకు చేరుకోవడానికి దళాలు చేరుకుంటున్నాయి.
హవాయి కార్చిచ్చులో మరణించిన వారి సంఖ్య 93 కు చేరింది. లహైనా భూకంప కేంద్రంలో కాలిపోయిన ఇళ్లు మరియు వాహనాలను గుర్తించే పని కొనసాగుతున్న నేపధ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఊరేగింపుపై దాడిని పెద్ద కుట్రలో భాగమని అభివర్ణించారు. మరోవైపు వీహెచ్‌పీ జాతీయ దర్యాప్తు సంస్ద ద్వారా విచారణకు డిమాండ్ చేసింది.
భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఉత్తర భారతదేశం లో మరో 20 మరణాలు నమోదయ్యాయి. దీనితో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 100 కు చేరింది.హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 31కి చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 80 మంది మరణించారు
కెన్యాలోని షకహోలా అడవిలో డూమ్స్‌డే కల్ట్‌లో ప్రాణాలతో బయటపడినవారు మరియు బాధితుల కోసం జరిగిన శోధనలో శనివారం మరో 22 మృతదేహాలను కనుగొన్నారని ప్రాంతీయ ప్రభుత్వ అధికారి తెలిపారు. వీటితో మరణాల సంఖ్య 201కి చేరింది.
: మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. , అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి. అయినప్పటికీ సాయుధ దళాల పహరా కొనసాగుతోంది.
సూడాన్‌లో సైన్యం మరియు పారామిలిటరీల మధ్య జరిగిన పోరులో సుమారు 200 మంది మరణించగా 1,800 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో పలు ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. వైద్య సామాగ్రి మరియు ఆహారం కొరత ఏర్పడింది.
: టర్కీ-సిరియా భూకంపంలో మృతుల సంఖ్య సోమవారం నాటికి 34,000 దాటింది. ఈ భూకంపం ఒక శతాబ్ద కాలంగా సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటి.
టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు.