Home / Congress
ఢిల్లీలో అధికారుల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ఆదివారం స్పష్టం చేసింది, ఇది సానుకూల పరిణామం' అని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. దీనిపై , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ,వారు (ఆప్) రేపు సమావేశంలో చేరబోతున్నారని నేను భావిస్తున్నాను. ఆర్డినెన్స్ విషయానికొస్తే, మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది.
కాంగ్రెస్‌కు అవినీతి అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, తాను అవినీతిపై చర్యలకు గ్యారెంటీ అని మోదీ అన్నారు.శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని అన్నారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మనిషని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికేనని రేవంత్ స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32 వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు.
Sonia Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం అక్కడ నూతన ప్రభుత్వం కొలువుదీరింది.
కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.