Home / cm jagan
ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చార్యాన్ని కలిగించాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎంతో చేసినా వారి ప్రేమలు ఏమయ్యాయో తెలియలేదన్నారు. ఏపీ ప్రజలకోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు ఎట్టికేలకు బెయిల్ మంజూరు చేసింది. కోర్ట్ కొన్ని షరతులు విధించింది. పోలీస్ విచారణకు సతీష్ సహకరించాలని ఆదేశించింది.
రాష్ట్రం రావణకాష్ఠంలాగా మారుతుంటే ఇరుపార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలు చేయడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్కు సీబీఐ కోర్టులో ఎట్టికేలకు ఊరట లభించింది. సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు.
సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో ను చూసి ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే . ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.
ముస్లిం రిజర్వేషన్లపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారని విమర్శించారు. ఆరు నూరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు .
ఏపీలో జరిగేది క్లాస్ వార్ అని.. సీఎం జగన్ అన్నారు. ఓటు వేసే ముందు అంతా ఒక సారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని.. టీడీపీకి ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్కు మరో లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. పాక్షికంగా అయినా మద్యపాన నిషేధం జరిగిందా అని ప్రశ్నించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్.. దానిని అమలు చేశాకే ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.