Home / cm jagan
జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు వైఎస్ షర్మిల తాజాగా లేఖాస్త్రం సంధించారు . ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు పై సినీ నటుడు ,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరో సారి విరుచుకు పడ్డారు .చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
: సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టోని విడుదల చేయడం విశేషం . మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెడుతున్నానని అని తెలిపారు .
సొంత చిన్నమ్మ లెటర్ రాస్తే కూడా పట్టించుకోని జగన్ నీది గుండెనా .లేక్ బండనా అంటూ అన్న జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకు పడింది . గురువారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షర్మిల ఏపీ ,సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టింది .
ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలస నుంచి ఎన్నికల సమరశంఖారావం పూరించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ టార్గెట్ అన్నారు. ప్రతిపక్షాలు పొత్తులు, ఎత్తులతో వస్తున్నాయని.. అయితే ఎన్నికల కురుక్షేత్రంలో ఈసారి కూడా గెలుపు వైసీపీదే అన్నారు.