Home / cm jagan
ఏపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాసారు.
వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి సీఎం జగనే కారణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ, ఆ దేవుడే సాక్ష్యమని చెప్పారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్దాయి విస్తృత స్దాయి సమావేశంలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంతో 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.
ఏపీ సీఎం జగన్‌ను కేశినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంపు ఆఫీసుకు కేశినేని శ్వేత వెళ్లారు. నాని వెంట మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ అయోధ్యరాంరెడ్డి, దేవినేని అవినాష్‌లు ఉన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు
వైఎస్ఆర్సిపి అధినేత జగన్ పై తీవ్రస్దాయిలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విరుచుపడ్డారు.. తాను చేసిన తప్పు ఏంటో వైఎస్ జగన్ చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. ఐదేళ్ళుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారి అయినా తమని పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి చెప్పారు.