Home / cm jagan
మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దూకుడును మరింత పెంచింది. విశాఖపట్నంలో వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యన్నారాయణ వైకాపా నేతలపై సీరియస్ అయ్యారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు.
చంద్రబాబు నాయుడు 14ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు
చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో నేడు సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదును విడుదల చేశారు. అంతేకాదు కుప్పం నుంచి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పింఛన్ పెంపును అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
సీఎం జగన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది.
ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు.
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు.