Home / CM Chandrababu Naidu
వైసీపీని రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదేగతి పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్దానిక బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు
అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు.
తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.
సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటో తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశించింది .
కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి తాము ఇచ్చిన ముఖ్యమైన హామీలపై ముఖ్య మంత్రి తొలి సంతకం చేయడం అనేది వైఎస్ తో ప్రారంభమైందని చెప్పొచ్చు . 2004 లో వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేసారు .
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపైన తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్ పైన తొలి సంతకం చేశారు.
తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని..తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు.