Home / Chandrababu
వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.
ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
దాడిశెట్టి కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ..చంద్రబాబు పై షాకింగ్ వర్డ్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.
మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి దాడిశెట్టి రాజాపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని, అది ఎన్టీఆర్‌పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు.
చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో నేడు సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదును విడుదల చేశారు. అంతేకాదు కుప్పం నుంచి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పింఛన్ పెంపును అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీ ఏర్పడ్డాక జగన్ వెంట అడుగులు వేసిన నాయకుల్లో నెల్లూరు జిల్లా నాయకులదే తొలిస్ధానం. కడప తర్వాత నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోటగా పిలుచుకుంటారు.
కుప్పం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం. బాబు ఇక్కడ ఎన్నికల సమయంలో నామినేషన్ మాత్రం వేసి వెళ్లిపోతారు. ప్రచారం, పోలింగ్ అంతా స్దానిక నేతలే చూసుకుంటారు.
ఏపీ, తెలంగాణలో ప్రముఖ రాజకీయ ముఖ్య నేతలు అయిన చంద్రబాబు నాయుడు మరియు సీఎం కేసీఆర్ లకు హర్యానా రాష్ట్రం ఆహ్వానం పలికింది. ఈ నెల 25న భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) భారీ ర్యాలీ నిర్వహించనుంది.