Home / celebrations
ఆ ఊరులో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుతీర్చుకుంటే మాములు విషయమే కదా అని అనుకుంటే పొరపాటే ..ఆ మొక్కుకు ఒక లెక్కవుంది
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహిస్తామన్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా దేశంలోని హిందువులు, జైనులు అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా బంగారం కొంటే అదృష్ట కలిసి వస్తుందని నమ్మకం భారతీయుల్లో ఉంటుంది.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు న్యూయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని ప్రజలకు సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.