Telangana State formation day Celebrations: జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు.. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహిస్తామన్నారు.
Telangana State formation day Celebrations: జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహిస్తామన్నారు. వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సి.ఎస్ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కార్నివాల్..(Telangana State formation day Celebrations)
. పరేడ్ గ్రౌండ్ లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు, సీఎం సందేశం ఉంటుందని తెలిపారు.సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. 5000 మంది ట్రైనీ పోలీస్ అధికారులు బ్యాండ్ తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 80కిపైగా స్టాల్స్ ఏర్పాటు చేసి హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాల చే తయారు చేసిన పలు వస్తువులతో పాటు నగరంలోని పేరొందిన హోటళ్ళచే ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే నగరపౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోద శాలను ఏర్పాటు చేశామని వివరించారు. ట్యాంక్ బండ్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.సీఎస్ శాంతికుమారి నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షలో డీజీపీ రవీ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీ.ఏ.డీ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు