Home / CBI raids
రూ. 820 కోట్ల మేర జరిగిన తక్షణ చెల్లింపు సేవ ( ఐఎంపిఎస్) కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటకతో సహా దాదాపు 13 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ సిస్టమ్‌లు, ఇమెయిల్ ఆర్కైవ్‌లు మరియు డెబిట్/క్రెడిట్ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను రికవరీ చేయడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు మరియు బ్యాంక్ అధికారులతో సహా నిందితుల ప్రాంగణాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ)ని ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) బుధవారం న్యూస్‌క్లిక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ సంస్దపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారి తెలిపారు.
బీమా కుంభకోణం కేసుకు సంబంధించి జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహాయకుడి నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లోని మరో ఎనిమిది ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
ఉద్యోగం కోసం భూమి కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులు కిరణ్ దేవి మరియు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన అనేక రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.
ఫైనాన్స్ అకౌంటెంట్ (ఎఫ్ఎ) రిక్రూట్మెంట్ స్కామ్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) జమ్ము కశ్మీర్లో దాడులు నిర్వహిస్తోంది.
డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ మరియు సరఫరాతో సంబంధం ఉన్న వ్యక్తుల పై భారీ దాడిలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) భారతదేశంలోని అనేక ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. యాంటీ డ్రగ్స్ ఆపరేషన్‌కు సంబంధించి సుమారు 175 మందిని అరెస్టు చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చైల్డ్ ఫోర్నోగ్రఫీ పై కొరఢా ఝళిపించింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, 56 లోకేషన్లలో ఏక కాలంలో దాడులు జరిపింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆన్లైన్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులు వెలుగు చూడ్డంతో సీబీఐ ఆపరేషన్ మెగాచక్రకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.
బీహార్‌లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిలాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు సునీల్ సింగ్‌తో సహా ఆర్జేడీ నేతలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.