Home / CBI enquiry
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
ఐసిఐసిఐ బ్యాంకు రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం (డిసెంబర్ 26) అరెస్టు చేసింది.
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్యాంక్ మంజూరు చేసిన రుణాలలో మోసం మరియు అవకతవకలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ మరియు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది.
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ట్రయల్ మాత్రమే.. అసలు కథ ముందుంది అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నిన్న కేసీఆర్ కూతురు కవితను సీబీఐ సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆ విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా ముగియలేదని పేర్కొంటూ సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చారు.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ బదులిచ్చింది. 11,12,14,15 తేదీల్లో ఓ రోజును కన్ఫార్మ్ చేయాలని సీబీఐని కవిత కోరగా ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్తూ సీబీఐ బదులిచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.