Home / asia cup 2023
ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.
ఆసియా కప్ 2023 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తక్కువే స్కోర్ కే పరిమితం అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంకను చిత్తుచేసి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ లో ఒకే గ్రూప్లోభారత్, పాకిస్థాన్‌లు ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా గురువారం ప్రకటించారు.