Home / ap news
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి సమీపంలోని కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో విష్ణుమూర్తితో పాటు శివలింగం, రెండు నంది విగ్రహాలు ఉండడం విశేషం. దీంతో కృష్ణా నది వద్దకు వెళ్ళిన గ్రామస్తులు విగ్రహాలను చూసి వెంటనే వాటికి ఒడ్డుకు చేర్చారు. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన
తన అభిమాన హీరోని ఆదర్శంగా తీసుకొని సామాజిక స్పృహతో.. ప్రజల కొరకు తాను కూడా అంటూ ఎప్పుడూ ముందుండే యువకుడు.. ప్రమాదం గురించి హెచ్చరిస్తూ ఊహించని రీతిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో చోటు చేసుకుంది. కళ్ళ ముందే విద్యుత్ వైరు తెగి ఉండడంతో..
ఏపీలో తాజాగా మరోమారు కరెంటు బిల్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్న పూరిగుడిసెకి.. విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో
ఏపీలోని నరసరావుపేటలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఇంటిని ఓ మహిళకు అద్దెకు ఇస్తే.. అందులో వ్యభిచారం నిర్వహిస్తోందని.. మట్కావ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటిని కబ్జా చేశారని.. అతను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు చర్యకు వెనుకాడుతున్నారని.. ఖాళీ చేయమంటే
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిపై పలమనేరు మండలంలో గల అటవీ సెక్షన్ సమీపంలో రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులను ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే మూడు ఏనుగులు మృతి చెందాయని స్థానికులు వెల్లడించారు. మృతి చెందిన మూడు
కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో శనివారం (జూన్ 3) నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ పరీక్ష జరుగుతుంది.
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. చివరకు అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.