Home / ap news
CM Chandrababu visits kuppam: సీఎం చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రలో భాగంగా రెండో రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్ సహకారంతో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు 13 పీహెచ్‌సీలతో పాటు 92 విలేజ్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రి అటాచ్ చేశారు. ఒకేచోట డిజి నెర్వ్ జరిగేలా చర్యలు తీసుకోనుంది. […]
ఏపీ, తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 5 రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిస్తాయని అంచనాల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు […]
Schools Bandh in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై నిరసన తెలుపుతూ నేడు పాఠశాలలు బంద్ పాటిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ మేరకు తల్లిదండ్రులు ఫోన్లకు ఇప్పటికే మెసేజ్ రూపంలో పంపించారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ ఆవేదన తెలిపేందుకే అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వెల్లడించాయి. అయితే పలు చోట్ల పాఠశాలలు ఓపెన్ చేశారు. […]
CM Chandrababu Visiting Kuppam Today: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటి ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. […]
YS Jagan Singaiah death case: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దళితుడు సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ వీడియోలను మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఘటన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల […]
Three Died in Road Accident Annamaya Dist: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో చెన్నమర్రి మిట్ట సమీపంలో టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వారికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక […]
Another Case Filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై సైతం కేసు ఫైల్ అయింది. అనుమతి లేకుండా మిర్చి యార్డులో హంగామా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబుతో పాటు పలువురికి నోటీసులు […]
Guntur police case filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదైంది. ఇటీవల జగన్ పర్యటనలో జగన్ కారు కిందపడి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మాజీ సీఎం జగన్‌పై BNS 106(1) Section కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరించి ఇతరుల మరణానికి కారణమైతే కేసు పెడ్తారు. తాజాగా, కొత్త […]
AP Government Depositing 13 Thousand for ‘Thalliki Vandanam’ Scheme: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు శుభవార్త చెప్పింది. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తొలుత ఈ ప్రక్రియ సాయంత్రం వరకు […]
CM Chandrababu and Minister Lokesh Press Meet: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికీ ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని, రైల్వే జోన్ సాధించుకున్నామన్నారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిందని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పామన్నారు. అభివృద్ధి, సంక్షేమం […]