Home / ap news
Wall Collapse At Simhachalam Temple 8 People Dead: ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లాలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేళ అపశ్రుతి జరిగింది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. […]
Rain Alert Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీలోని యానాం, రాయలసీమ వంటి ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు కూడా పడొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రిలో వర్షం పడుతోంది. కల్లాలు, వ్యవసాయ […]
AP Government Good News To Ration Card Holders: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు మరింత మేలు చేసుందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులతో పాటు పోషక విలువలు ఉన్న కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే జూన్ నెల నుంచే రేషన్‌లో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు, […]
Son killed parents for property: రోజురోజుకూ విలువలు దారుణంగా తయారవుతున్నాయి. ప్రాణం అంటే లెక్క లేకుండా పోతోంది. డబ్బు కోసం ఏకంగా సొంత వాళ్లను సైతం చంపేందుకు వెనకడుగు వేయడం లేదు. ఆవేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే అన్నదమ్ములు, తల్లిదండ్రులు, తోబుట్టువులను సైతం హత్య చేస్తున్నారు. తాజాగా, ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా విషయంలో వచ్చిన ఘర్షణలో కుమారుడు ఏకంగా తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. […]
AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు మేలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే మే 19వ తేదీన పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. ఈ పరీక్షలు మే 28వ తేదీన ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల కోసం నేటి నుంచి […]
AP Deputy CM Pawan Kalyan Comments about YSRCP: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న నిధుల దుర్వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురస్కరించుకొని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. గత పాలకులు గ్రామ పంచాయతీ నిధులను నిర్వీర్యం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే కొంతమంది నిధులను పనులు […]
Nara Lokesh Released AP Tenth Results 2025: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఉదయం 10 గంటలకు పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అనంతరం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in లేదా http://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దీంతో పాటు మన మిత్ర వాట్సప్, లీప్ యాప్‌లో సైతం ఫలితాలను చెక చేసుకునేలా […]
AP IPS Officer PSR Anjaneyulu Arrested: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌లో తన నివాసంలో అరెస్ట్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ […]
Election Notification for Ap Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీనికి భర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ని విడుదల చేసింది. త్వరలోనే ఈ నెల 22 నుంచి 29 […]
AP Government given green signal to special education teacher posts: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే డీఎస్పీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 SGT, 1,124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను విడుదల చేసింది. […]