Home / ap dgp
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే వెలువడ్డాయని, ఆలస్యం చేయకుండా విధుల్లో చేరాలని ఆదేశించారు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌తోపాటు ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాస్ తనపై చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ వర్మ తల తెస్తే కోటి రూపాయల బహుమానం ఇస్తానని కొలికిపూడి చేసిన వ్యాఖ్యలని ఫిర్యాదులో ప్రస్తావించారు. వ్యూహం సినిమాని దృష్టిలో పెట్టుకుని కొలికిపూడి ఈ వ్యాఖ్యలు చేశారు.
అది ఒక రాష్ట్ర డీజీపీ ట్విట్టర్ అకౌంట్ .. బాధ్యత గల పదవిని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాల్సిన వృత్తిలో ఉన్న పోలీస్ బాస్ ఆయన.అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శంగా ఉండేలా నడుచుకోవాల్సిన అవసరం ఉంది.ఇక ఆయన సోషల్ మీడియా ఖాతా కూడా అంతే సామాజిక స్పృహతో మెయింటైన్ చేయాలి.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాల నేపధ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలపై భాజాపా నేత విష్ణువర్ధన రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ ప్లేస్ గా మారింది. అధికార పార్టీ పోలీసింగ్ గా భావిస్తున్న ప్రతిపక్షాలకు అవుననే సమాధానం పోలీసుల నుండే ఎదురైంది. ఓ ఎంపీ కారు ప్రతిపక్ష శాసనసభ్యులు చూస్తుండగానే దర్జాగా లోపలకు పోవడంతో ఈ విషయం బయటపడింది
అన్నమయ్య జిల్లా పోలీసులపై ఎర్ర చందనం దొంగలు దాడులకు తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో మరీ రెచ్చిపోయారు. చివరకు 8మంది ఎర్ర చందనం స్మగ్లర్స్ పోలీసుల చేతికి చిక్కారు