Last Updated:

Red Sandalwood Smugglers: పోలీసులపై దాడికి తెగబడ్డ ఎర్ర చందనం స్మగ్లర్స్

అన్నమయ్య జిల్లా పోలీసులపై ఎర్ర చందనం దొంగలు దాడులకు తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో మరీ రెచ్చిపోయారు. చివరకు 8మంది ఎర్ర చందనం స్మగ్లర్స్ పోలీసుల చేతికి చిక్కారు

Red Sandalwood Smugglers: పోలీసులపై దాడికి తెగబడ్డ ఎర్ర చందనం స్మగ్లర్స్

Annamaiah Dist: అన్నమయ్య జిల్లా పోలీసులపై ఎర్ర చందనం దొంగలు దాడులకు తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో మరీ రెచ్చిపోయారు. చివరకు 8మంది ఎర్ర చందనం స్మగ్లర్స్ పోలీసుల చేతికి చిక్కారు. జిల్లా ఎస్పీ హర్షవర్దన్ సమాచారం మేరకు కలికిరి మండల గుట్టపాళెం చెక్ పోస్టు వద్ద ఉదయం సమయంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అదే సమయంలో ఓ ద్విచక్ర వాహనంతోపాటు ఇన్నొవా కారును ఆపే ప్రయత్నం పోలీసుల చేసారు. వేగంగా వెళ్లుతున్న వాహనాన్ని అడ్డుకొనే క్రమంలో పోలీసులపైకి దొంగలు దాడులకు దిగారు. చివరకు 8మంది దొంగలు పోలీసులు చిక్కారు. వారంతా తమిళనాడు రాష్ట్రం తిరుమణ్ణామలై జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. సుండుపల్లి, వీరబల్లి ప్రాంతాల్లోని శేషాచలం అడవుల్లో నుండి ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పట్టుబడ్డ దొంగల నుండి రూ. 33.50లక్షల విలువచేసే 19 ఎర్ర చందనపు దుంగలను స్వాధీనం చేసుకొన్న ఎస్పీ పేర్కొన్నారు. రాళ్లదాడిని ఎదుర్కొని దొంగలను పట్టుకొన్న పోలీసులకు రివార్డులు ఇస్తామని ఆయన తెలిపారు.

గత చాలా కాలంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల మీదుగా ఎర్ర చందనపు దుంగలను చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు విరివిగా తరలిస్తున్నా పోలీసులు పెద్దగా పట్టుకొన్న దాఖలాలు లేవు…చిన్న చేపలు చిక్కుతున్నాయే కాని పెద్ద తిమింగళాలు మాత్రం రాజకీయ నేతల అండదండలతో దర్జాగా ఎర్ర చందనపు దుంగలను తరలిస్తున్నారని వాదన కూడా బలంగా లేకపోలేదు.

ఇవి కూడా చదవండి: