Textile Mills Association: ఆర్ధిక మాంద్యంతో 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసివేత
ఏపీలో 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసి వేస్తున్నట్లు టెక్స్ టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. పరిశ్రమను ఆర్ధిక మాంద్యం వెంటాడుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
Andhra Pradesh: ఏపీలో 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసి వేస్తున్నట్లు టెక్స్ టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. పరిశ్రమను ఆర్ధిక మాంద్యం వెంటాడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం 50 శాతం మాత్రమే మిల్లులు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం నుండి స్పిన్నింగ్ మిల్లులు పనిచేయవని తెలిపారు.
కేంద్రం పత్తిని కమాడిటీస్ ఎంసిఎక్స్ ఆన్ లైన్ ట్రేడింగ్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ, విద్యుత్ రాయితీ బకాయలు రూ. 14 వందల కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. స్పిన్నింగ్ మిల్లుల మీద ఆధారపడి రెండున్నర లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారన్నారు. విధిలేని పరిస్ధితిలో మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు లంకా రఘరామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన రూపాయి విలువ..!