Last Updated:

RashidKhan: రషీద్ సంచలన ఇన్నింగ్స్.. పలు రికార్డులు బద్దలు

RashidKhan: గుజరాత్ టీం ఓ వైపు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊర కొట్టుడు కొట్టాడు.

RashidKhan: రషీద్ సంచలన ఇన్నింగ్స్.. పలు రికార్డులు బద్దలు

RashidKhan: ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ పలు రికార్డులు సృష్టించాడు.

ర‌షీద్ ఖాన్ సిక్స‌ర్ల వ‌ర్షం..(RashidKhan)

గుజరాత్ టీం ఓ వైపు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊర కొట్టుడు కొట్టాడు. బౌలర్ ఎవరు అనేది చూసుకోకుండా మెరుపు ఇన్నింగ్స్ ఆది ముంబై కి ఒక దశలో వణుకు పుట్టించేశాడు. 103 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయిన గుజ‌రాత్.. ర‌షీద్ విధ్వంసంతో 191 ప‌రుగులు చేసింది. అయితే భారీ ల‌క్ష్యం కావ‌డం.. మరోవైపు సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్ మెన్ లేకపోవడంతో గుజ‌రాత్ ని విజయ తీరాలకు చేర్చలేకపోయడు. ముంబై బౌల‌ర్ల‌లో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయ‌గా పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు, బెహ్రెన్ డార్ఫ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

పలు రికార్డులు..

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో.. పరుగుల వరద పారింది. తొలుత సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. అటుపై  రషీద్‌ ఖాన్‌ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

219 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఒక దశలో 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక గుజరాత్‌కు భారీ ఓటమి తప్పదనుకున్న వేళ రషీద్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

రషీద్ ఖాన్.. 32 బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో రషీద్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఒకే మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి.. అర్దసెంచరీ చేయడం ఇది నాలుగోసారి. ఈ మ్యాచ్ లో రషీద్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు.. 79 పరుగులు చేశాడు.

ఇంతకముందు యువరాజ్‌ సింగ్‌(ఆర్‌సీబీ, 83 పరుగులు, 4/35), యువరాజ్‌ సింగ్‌(పుణే వారియర్స్‌, 66 పరుగులు, 4/29), మిచెల్‌ మార్ష్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌, 63 పరుగులు, 4/27) ఉన్నారు.

టీ20 చరిత్రలో 9 వికెట్ కు అత్యధిక పరురుగు జోడించడం కూడా నాలుగోసారి. 9 వ వికెట్ కు రషీద్‌-అల్జారీ జోసెఫ్‌ జంట 88 పరుగులు జోడించారు.

తొలి స్థానంలో బెల్జియంకు చెందిన సబర్‌ జకీల్‌, సక్లెయిన్‌ అలీ 2021లో ఆస్ట్రియాపై 132 పరుగులతో ఉన్నారు.

ఐపీఎల్‌ చరిత్రలో చేజింగ్‌ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రషీద్‌ ఖాన్‌ చోటు సంపాదించాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రషీద్‌ 10 సిక్సర్లు బాదాడు.

ఈ జాబితాలో సనత్‌ జయసూర్య 11 సిక్సర్లతో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, కీరన్‌ పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌లు పదేసి సిక్సర్లతో ఉన్నారు.

ఐపీఎల్‌లో ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో రషీద్‌ చోటు సంపాదించాడు.

రషీద్‌ కంటే ముందు పాట్‌ కమిన్స్‌(2021లో 66 పరుగులు నాటౌట్‌), హర్బజన్‌ సింగ్‌(2015లొ 64 పరుగులు), క్రిస్‌ మోరిస్‌(2017లో 52 పరుగులు నాటౌట్‌) ఉన్నారు.