Home / క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ ఉచిత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అవకాశం టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో చోటుచేసుకొన్న తొక్కిసలాటలో గాయపడ్డ క్రీడాభిమానులకు మాత్రమే.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తుది దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి విజయం సాధించి స్కోర్ సమం చేసుకోగా.. ఇక సిరీస్ నిర్ణయాత్మక పోరుకు నేడు ఉప్పల్ స్టేడియం వేదికకానుంది.
టెన్నిస్ దిగ్గజం, స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ కు వీడ్కోలు పలికారు. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి లావెర్ కప్ 2022లో డబుల్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఫెదరర్ కంటితడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావెర్ కప్ 2022తో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. నాగపూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ని 1-1గాసమం చేసింది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి టీం ఇండియా పగతీర్చుకుంది.
భారత్ - ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. టిక్కెట్ల విక్రయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్టర్‌ప్లాప్ అయ్యింది.
ప్రపంచ క్రికెట్లో పాక్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ లో పాక్ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం డీలాపడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ఓటమికి రెండో మ్యాచ్ తో పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా బాబర్-రిజ్వాన్ ల జోడీ తిరగరాసింది.
భారత్ - ఆసీస్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవని అజారుద్దీన్ అన్నారు. టికెట్ల విక్రయంలో హెచ్ సి ఎ ఎలాంటి తప్పు చేయలేదని, ఆన్లైన్లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో విక్రయం ఎలా సాధ్యం అవుద్దని ప్రశ్నించారు.
ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.
జింఖానాగ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులపై అజారుద్దీన్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసారు.