Home / క్రీడలు
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.
సుప్రీంకోర్టు సోమవారం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాన్నిసవరించాలని, ఒక వారంలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
భారత్- జింబాబ్వే మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది.
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ తనకు పని కల్పించి ఆదుకోవాలని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కోరాడు.భారత క్రికెట్ నియంత్రణ మండలి నుండి వచ్చే పెన్షన్ ఒక్కటే తన ఆదాయ వనరు కాబట్టి క్రికెట్‌కు సంబంధించిన అసైన్మెంట్ల కోసం చూస్తున్నానని చెప్పాడు.
రేపటి నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. అయితే వన్డే సిరీస్ కు ముందు భారత్ ను గాయాల బెడద వెంటాడుతుంది. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు.
థర్డ్ పార్టీల నుండి మితిమీరిన ప్రభావం" కారణంగా భారతదేశాన్ని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి (ఫిఫా)మంగళవారం సస్పెండ్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును దేశం నుండి తొలగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్‌హామ్‌లో మెడల్స్ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు.
విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో టీ20లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో 600వ వికెట్ తీసి, ఈ ఘనతను అందుకున్నాడు.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టునుంచి బయటకు వచ్చి గోవా జట్టలో చేరాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ గత ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున రెండు T20లు ఆడాడు.