Home / క్రీడలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్, ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతోంది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఫిఫాప్రపంచ కప్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే సమయముంది. ఈ మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలో బీర్ అమ్మకాలను ఖతార్ నిషేధించింది. అంతకుముందు, అధికారిక స్పాన్సర్ బడ్వైజర్ ఖతార్ ప్రపంచ కప్ అధికారిక వేదికలలో బీర్ విక్రయించడానికి అనుమతించబడింది.
ఫుట్‌బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుతో క్వార్టర్స్‌లో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.
ఐపీఎల్ 2023 ట్రేడింగ్ విండో మంగళవారంతో ముగిసిపోయింది. మినీ ఆక్షన్ కు కీలకమైన ప్రక్రియ పూర్తయింది. దేశంలోని 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేశాయి. ఇక వేలంలో ఎవరుంటారనేది తేలిపోయింది. వేలంలో ఎవరిని ఎంతపెట్టి ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ వీడ్కోలు పలికారు.
భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది. కివీస్ పర్యటనలో భాగంగా ఈ నెల 18 నుంచి 30 వరకు భారత్ న్యూజిలాండ్ టీంతో మూడు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. భారత్‌తో ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ జట్టులో కీలక మార్పులు చేసింది. టీమిండియాపై మంచి రికార్డు ఉన్న ఇద్దరు కీలక ఆటగాళ్లను కివీస్ సెలెక్టర్లు పక్కన బెట్టారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అని టాక్ నడుస్తున్న తరుణంలో తాజాగా ఈ జంట అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఓ టాక్‌షో చేయనున్నారు.
ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచ కప్ తుదిపోరులో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ సమరంలో పాకిస్థాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఆంగ్ల జట్టు 138 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు తమ ఖాతాలో రెండో పొట్టి ప్రపంచక కప్ ను వేసుకుంది.
మెబ్ బోర్న్ మైదానం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ జట్టు ట్రోఫీని గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ జట్టు తమ ఖాతాలో రెండు పొట్టి ప్రపంచకప్ లను వేసుకుంది.