pele : సాకర్ దిగ్గజం పీలే ఇకలేరు … కాన్సర్ తో పోరాడుతూ కన్నుమూత
pele : ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూశారు. రికార్డుల రారాజుగా పేరొందిన ఈ బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ మరణంతో ఆయన అభిమనులంతా తీవ్ర విషాదంలో
pele : ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూశారు. రికార్డుల రారాజుగా పేరొందిన ఈ బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ మరణంతో ఆయన అభిమనులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నపీలే… ఆరోగ్యం విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. సావోపాలో లోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని పీలే కూతురు దృవీకరించారు. క్యాన్సర్ బారిన పడిన పీలేకు గత ఏడాది సెప్టెంబర్ లో వైద్యులు పెద్దపేగులో క్యాన్సర్ కణతిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమో థెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన ఈ లోకాన్ని విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
బ్రెజిలో లోని ట్రెస్ కొరాకోస్ లో అక్టోబర్ 23, 1940న పీలే జన్మించారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. సాకర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటాగాడిగా ఖతి పొందిన ఆయన 82 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడవడం శోచనీయం అని చెప్పాలి. ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పీలేకు పేరుంది. తన కెరీర్ లో 1363 మ్యాచ్‌లు ఆడిన పీలే… 1279 గోల్స్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బ్రెజిల్ తరపున 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరపున నాలుగు సార్లు ఫుట్ బాల్ ప్రపంచకప్ కు ప్రాతినిధ్యం వహించిన పీలే… 1958, 1962, 1970లో ప్రపంచ కప్‌ను అందించారు. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా పీలే రికార్డుల్లో నిలిచాడు. 1971లో బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి ఆయన రిటైరయ్యాడు. 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీచే పీలే శతాబ్దపు అథ్లెట్‌గా ఎంపికయ్యాడు.
అంతర్జాతీయ అరంగేట్రం…
పీలే 15 సంవత్సరాల వయస్సులో శాంటోస్ తరపున ఫుట్‌బాల్ ఆటలో ఎంట్రీ ఇచ్చారు. 16 సంవత్సరాల వయస్సులో బ్రెజిలియన్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. పీలే 7 జూలై 1957న అర్జెంటీనా తరపున అంతర్జాతీయ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1తో విజయం సాధించగా, పీలే ఆ మ్యాచ్‌లో గోల్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో, పీలే వయస్సు 16 సంవత్సరాల 9 నెలలు మాత్రమే. అతను గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్రెజిలియన్ ఆటగాడిగా నిలిచాడు. 1958 లో ప్రపంచ కప్‌లో పాల్గొన్న పీలే… ప్రపంచ కప్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాను రికార్డులు నెలకొల్పాడు.
ఇప్పుడు పీలే మృతితో సాకర్ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఈ మేరకు ఆయన కుమార్తె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మేం ఏమైనా, అది మీ వల్లనే. మేం నిన్ను చాలా ప్రేమిస్తున్నాం. రెస్ట్ ఇన్ పీస్’ అంటూ పోస్ట్ చేసింది. పలువురు ప్రముఖులు పీలే మృతికి నివాళి అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.