Home / క్రీడలు
ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు వినూత్న రీతిలో ఫోజ్ ఇచ్చారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. ఎందుకిలా అనే ప్రశ్న మీకు కలిగింది కదా అయితే ఈ కథనం చూసేయ్యండి.
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గోవా పర్యాటక శాఖ యువీకి నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేషన్ చేయకుండానే యువీ వాడుకుంటున్నట్లు ఫిర్యాదు నమోదు చేసింది.
ఫిఫా వరల్డ్కప్లోఇంగ్లండ్, ఇరాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది
ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని బౌండరీలను బాదాడు. బౌలర్ల భరతం పట్టడమే పనిగా పెట్టుకున్నట్లు.. ప్రత్యర్థిపై కనీస కనికరం లేనట్లు ఓ యువ క్రికెటర్ మైదానంలో విజృంభించాడు. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాలని కంకణం కట్టుకున్నట్లు ప్రతీ బంతిని బౌండరీ దాటించాడు. కేవలం 141 బంతుల్లో 277 పరుగు తీశారు.
వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రస్తుతం ఖతర్‌లో హల్చల్ చేస్తున్నాడు. ఖతర్‌లో జరిగే 2022 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఆయన టోర్నమెంట్ జరిగినన్ని రోజుల పాటు మతపరమైన ప్రసంగాలు కొనసాగిస్తాడు.
ఖతార్ వేదికగా ఫిఫా పురుషుల ప్రపంచ కప్ ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యింది. ఆరంభ మ్యాచ్ లో ఈక్వెడార్ 2–0 తేడాతో ఆతిథ్య ఖతార్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఈక్వెడార్ ఆటగాళ్లను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన ప్రేక్షకులు ‘మాకు బీర్లు కావాలి’ అంటూ గోలగోల చేశారు.
భారత్–న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్లో తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల టాస్ కూడా పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్ కాస్త రెండు టీ20ల పోరుగా కుదించబడింది. అయితే ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ కి వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది.
నేటి నుంచి ఖతార్ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగనుంది. ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్ ( Qatar)ఈక్వెడార్‌ను ఢీకొనబోతోంది.
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ సతీసమేతంగా వెకేషన్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. సతీమణి అనుష్కశర్మ, కుమార్తె వామికతో కలిసి అందమైన ప్రదేశాలలో విహరిస్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.