Last Updated:

MI vs KKR: మురిసిన ముంబయి.. కోల్ కతాపై ఘన విజయం

MI vs KKR: వాంఖ‌డే స్టేడియం వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ముంబై జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది.

MI vs KKR: మురిసిన ముంబయి.. కోల్ కతాపై ఘన విజయం

MI vs KKR: కోల్ కతాపై ముంబయి ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో రెండో ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 5 వికెట్లు కోల్పోయి మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ముంబయి బ్యాటింగ్ లో ఇషన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ రాణించారు.

మెుదట వెంకటేష్ అయ్యర్ సెంచరీతో కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. అయ్యర్ మినహా మిగతా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించలేదు. చివర్లో రసెల్ రాణించాడు.
అయ్యర్ 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.

 

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 16 Apr 2023 06:55 PM (IST)

    MI vs KKR: మూడో వికెట్ డౌన్.. విజయానికి చేరువగా ముంబయి

    ముంబయి మూడో వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ సూయాష్ శర్మ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తిలక్ వర్మ 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మరోవైపు ముంబయి విజయం దిశగా అడుగులు వేస్తోంది.

  • 16 Apr 2023 06:23 PM (IST)

    MI vs KKR: ఇషాన్ కిషన్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ముంబయి

    ముంబయి ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్ లో ఇషన్ బౌల్డయ్యాడు. కిషన్ 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

  • 16 Apr 2023 06:20 PM (IST)

    MI vs KKR: ఇషాన్ కిషన్ అర్దసెంచరీ.. 22 బంతుల్లో 52 పరుగులు

    ఇషాన్ కిషన్ అర్దసెంచరీ సాధించాడు. కేవలం 22 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

  • 16 Apr 2023 06:17 PM (IST)

    MI vs KKR: ముగిసిన పవర్ ప్లే.. వికెట్ నష్టానికి 73 పరుగులు చేసిన ముంబయి

    ముంబయి ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. పవర్ ప్లే ముగిసేసరికి 70 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 16 Apr 2023 05:44 PM (IST)

    MI vs KKR: బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి..

    186 లక్ష్య ఛేదనలో ముంబయి బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ వచ్చారు.

  • 16 Apr 2023 05:29 PM (IST)

    MI vs KKR: వెంకటేష్ అయ్యర్ సెంచరీ.. ముంబయి లక్ష్యం 186 పరుగులు

    వెంకటేష్ అయ్యర్ సెంచరీతో కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. అయ్యర్ మినహా మిగతా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించలేదు. చివర్లో రసెల్ రాణించాడు.
    అయ్యర్ 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.

    కోల్ కతా బౌలర్లలో షోకిన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. గ్రీన్, జాన్సెన్, చావ్లా, మెరిడిత్ తలో ఓ వికెట్ తీసుకున్నారు.

  • 16 Apr 2023 05:09 PM (IST)

    MI vs KKR: వెంకటేష్ అయ్యర్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన కోల్ కతా

    కోల్ కతా ఐదో వికెట్ కోల్పోయింది. మెరిడిత్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. అయ్యర్ 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.

  • 16 Apr 2023 05:06 PM (IST)

    MI vs KKR: వెంకటేష్ అయ్యర్ విధ్వంసం.. 49 బంతుల్లో 100 పరుగులు

    వెంకటేష్ అయ్యర్ సెంచరీ సాధించాడు. వచ్చిరావడంతోనే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.

  • 16 Apr 2023 05:01 PM (IST)

    MI vs KKR: నాలుగో వికెట్ డౌన్.. సెంచరీకి చేరువగా అయ్యర్

    అయ్యర్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం 98 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 16 ఓవర్లకు కోల్ కతా 146 పరుగులు చేసింది.

  • 16 Apr 2023 04:46 PM (IST)

    MI vs KKR: నాలుగో వికెట్ డౌన్.. తక్కువ పరుగులకే ఔటైన శార్దుల్

    కోల్ కతా నాలుగో వికెట్ కోల్పోయింది. షోకిన్ బౌలింగ్ లో శార్దుల్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు.

  • 16 Apr 2023 04:36 PM (IST)

    MI vs KKR: ముగిసిన 11వ ఓవర్.. చెలరేగి ఆడుతున్న వెంకటేష్

    11 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 104 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యార్ సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. మెరిడిత్ వేసిన ఓవర్లు వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు వెంకటేష్ అయ్యర్.

  • 16 Apr 2023 04:25 PM (IST)

    MI vs KKR: కేకేఆర్ మూడో వికెట్ డౌన్

    కేకేఆర్ మూడో వికెట్ ను కోల్పోయింది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్ రాణా(5).. హృతిక్ షోకీన్ బౌలింగ్ లో రమన్ దీప్ కు క్యాచ్ ఇచ్చాడు. వెంకటేష్ అయ్యర్ హాప్ సెంచరీ సాధించాడు.

  • 16 Apr 2023 04:22 PM (IST)

    MI vs KKR: హాప్ సెంచరీకి దిశగా వెంకటేష్ అయ్యర్

    వెంకటేష్ అయ్యర్ దూకుడు కొనసాగుతోంది. హృతిక్ షోకీన్ వేసిన 7 వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో అయ్యర్ రెండు బౌండరీలు సాధించి అర్థ సెంచరీకి చేరువయ్యాడు. క్రీజులో నితీష్ రాణా(1), వెంకటేష్ అయ్యర్ (48) ఉన్నారు.

  • 16 Apr 2023 04:13 PM (IST)

    MI vs KKR: రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    కోల్ కతా రెండో వికెట్ కోల్పోయింది. పీయూష్ చావ్లా వేసిన 5 ఓవర్లో మూడో బంతికి రెహ్మనుల్లా (8) డ్యూన్ జూనె సెన్ కు క్యాచ్ ఇచ్చాడు.

  • 16 Apr 2023 04:06 PM (IST)

    MI vs KKR: అయ్యర్ దూకుడు

    వెంకటేష్ అయ్యర్ దూకుడు కొనసాగిస్తున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 4 వ ఓవర్లో రెండో బంతిని 6 గా మలిచాడు. తర్వాతి బంతి వెంకటేష్ మోకాలికి తగలడంతో కాసేపు నొప్పితో బాధపడ్డాడు. తర్వాత నాల్గో బంతికి 4 బాదాడు. 3 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 39/1. రెహ్మనుల్లా(6), వెంకటేష్ అయ్యర్ (24) క్రీజులో ఉన్నాడు.

  • 16 Apr 2023 03:42 PM (IST)

    MI vs KKR: మూడో ఓవర్.. వరుసగా ఫోర్, సిక్స్

    అర్జున్ టెండూల్కర్ వేసిన మూడో ఓవర్లో 13  పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యార్ వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టాడు.

  • 16 Apr 2023 03:35 PM (IST)

    MI vs KKR: తొలి ఓవర్.. కేవలం 5 పరుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్

    తొలి ఓవర్ అర్జున్ టెండూల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇందులో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

  • 16 Apr 2023 03:34 PM (IST)

    MI vs KKR: అర్జున్ టెండుల్కర్ బౌలింగ్..

    స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేస్తున్నాడు. తొలి ఓవర్ టెండుల్కర్ తో ప్రారంభించారు.

    ఓపెనర్లుగా.. గుర్బాజ్, జగదీశన్ వచ్చారు.

  • 16 Apr 2023 03:17 PM (IST)

    MI vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ తుదిజట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీషన్, నితీష్ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

  • 16 Apr 2023 03:16 PM (IST)

    MI vs KKR: ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు

    ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్

  • 16 Apr 2023 03:15 PM (IST)

    MI vs KKR: మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్ గా సూర్యకుమార్

    రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అనారోగ్యంతో దూరం కావ‌డంతో ఈ మ్యాచ్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌ధ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు.