GT vs LSG: ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ గెలుపు
GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
GT vs LSG: నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు సాధించింది. చివరి ఓవర్లో వరుసగా వికెట్లు పడటంతో.. రాహుల్ సేన ఓటమి పాలైంది.
LIVE NEWS & UPDATES
-
GT vs LSG: నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపొందిన గుజరాత్
నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ గెలుపు సాధించింది. చివరి ఓవర్లో వరుసగా నాలుగు వికెట్లు పడటంతో.. రాహుల్ సేన ఓటమిపాలైంది.
-
GT vs LSG: ఉత్కంఠ.. చివరి ఓవర్లో 12 పరుగులు
లక్నో- గుజరాత్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. చివరి ఓవర్లో 12 పరుగులు అవసం అయ్యాయి.
-
GT vs LSG: రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. కృనాల్ ఔట్
లక్నో రెండో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో కృనాల్ స్టంపౌట్ అయ్యాడు. కృనాల్ 23 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
-
GT vs LSG: విజయం దిశగా లక్నో.. 13 ఓవర్లకు 98 పరుగులు
లక్నో విజయం దిశగా దూసుకెళ్తుంది. 13 ఓవర్లకు 98 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అర్దసెంచరీ సాధించాడు.
-
GT vs LSG: తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మెయర్స్ క్లీన్ బౌల్డ్
లక్నో తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్ లో మేయర్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
GT vs LSG: ముగిసిన పవర్ ప్లే.. 53 పరుగులు చేసిన లక్నో
పవర్ ప్లే లో లక్నో ధాటిగా బ్యాటింగ్ చేసింది. వికెట్ నష్టోపోకుండా 53 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్ 30 పరుగులు.. మేయర్స్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
GT vs LSG: మూడో ఓవర్.. వరుసగా మూడు ఫోర్లు.. కేఎల్ రాహుల్ 7వేల పరుగులు
మూడో ఓవర్లు వరుసగా కేఎల్ రాహుల్ మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో పాటు ఐపీఎల్ లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
-
GT vs LSG: రెండో ఓవర్లు 6 పరుగులు..
రెండో ఓవర్లో లక్నో 6 పరుగులు సాధించింది. ఈ ఓవర్లో మేయర్స్ ఓ ఫోర్ సాధించాడు.
-
GT vs LSG: మెయిడిన్ ఓవర్ వేసిన షమీ..
తొలి ఓవర్ మెయిడిన్ అయింది. షమీ ఆరు బంతులు కట్టుదిట్టంగా వేశాడు.
-
GT vs LSG: బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో.. క్రీజులోకి రాహుల్, మేయర్స్
లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. షమీ తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
GT vs LSG: తడబడిన గుజరాత్.. లక్నో లక్ష్యం 136 పరుగులు
లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. గుజరాత్ తరపున పాండ్యా ఒక్కడే రాణించాడు. పాండ్యా 50 బంతుల్లో 66 పరుగులు చేశాడు. సాహా కూడా తనవంతు సాయం అందించాడు. లక్నో బౌలర్లలో స్టాయినిస్, కృనాల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీసుకున్నారు.
-
GT vs LSG: 18వ ఓవర్లో భారీగా పరుగులు.. వరుసగా ఫోర్, రెండు సిక్సులు
బిష్ణోయ్ వేసిన ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఇందులో వరుసగా ఫోర్, రెండు సిక్సులు ఉన్నాయి.
-
GT vs LSG: హర్దీక్ పాండ్యా అర్ధసెంచరీ.. వరుసగా ఫోర్, రెండు సిక్సులు
హర్దీక్ పాండ్యా అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బిష్ణోయ్ బౌలింగ్ లో వరుసగా ఫోర్, రెండు సిక్సులు కొట్టాడు.
-
GT vs LSG: 17వ ఓవర్ పూర్తి.. 102 పరుగులు చేసిన గుజరాత్
17వ ఓవర్ పూర్తయ్యేసరికి గుజరాత్ 102 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా, మిల్లర్ ఉన్నారు.
-
GT vs LSG: విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్.. మెయిడిన్ వికెట్ తీసిన నవీన్ ఉల్ హక్
నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ కేరీర్ లో నవీన్ ఉల్ హక్ తొలి వికెట్ తీసుకున్నాడు.
-
GT vs LSG: 13ఓవర్లకు 85 పరుగులు చేసిన గుజరాత్..
గుజరాత్ బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది. 13 ఓవర్లకు 85 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా, విజయ్ శంకర్ ఉన్నారు.
-
GT vs LSG: మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. మనోహర్ ఔట్
గుజరాత్ కష్టాల్లో పడింది. అమిత్ మిశ్రా బౌలింగ్ లో అభినవ్ మనోహర్ క్యాచ్ ఔటయ్యాడు. మనోహర్ 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు. ప్రస్తుతం గుజరాత్ 77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
-
GT vs LSG: రెండో వికెట్ తీసిన కృనాల్.. సాహా క్యాచ్ ఔట్
వరుసగా కృనాల్ రెండో వికెట్ తీశాడు. వృద్ధిమాన్ సాహాను క్యాచ్ ఔట్ చేశాడు. సాహా 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు.
-
GT vs LSG: అమిత్ మిశ్రా వేసిన ఓవర్లో 6 పరుగులు
అమిత్ మిశ్రా వేసిన 10 ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి.
-
GT vs LSG: 9 ఓవర్లో భారీగా పరుగులు.. సిక్స్, ఫోర్ కొట్టిన పాండ్యా
రవి బిష్ణోయ్ వేసిన 9 ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో పాండ్యా ఓ ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో 14 పరుగులు వచ్చాయి.
-
GT vs LSG: 8 ఓవర్లో 7 పరుగులు.. కట్టుదిట్టంగా లక్నో బౌలింగ్
సోయినిస్ వేసిన 8 ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.
8వ ఓవర్ చివరి బంతికి సాహా ఫోర్ సాధించాడు.
-
GT vs LSG: ముగిసిన పవర్ ప్లే.. వికెట్ నష్టానికి 40 పరుగులు చేసిన గుజరాత్
పవర్ ప్లే లో గుజరాత్ తడబడింది. వికెట్ నష్టానికి కేవలం 40 పరుగులు మాత్రమే చేసింది.
-
GT vs LSG: ఐదో ఓవర్లో 9 పరుగులు.. నెమ్మెదిగా గుజరాత్ బ్యాటింగ్
ఐదు ఓవర్లకు గుజరాత్ 29 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో సాహా, హార్దీక్ పాండ్యా ఉన్నారు.
-
GT vs LSG: ముగిసిన మూడో ఓవర్.. 13 పరుగులే చేసిన గుజరాత్
మూడు ఓవర్లకు గుజరాత్ 13 పరుగులు చేసింది.
-
GT vs LSG: రెండో ఓవర్.. వికెట్ నష్టానికి 5 పరుగులు
గుజరాత్ నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. రెండు ఓవర్లకు 5 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది.
-
GT vs LSG: తొలి వికెట్ డౌన్.. శుభ్ మన్ గిల్ ఔట్
గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో గిల్ క్యాచ్ ఔటయ్యాడు.
-
GT vs LSG: తొలి ఓవర్.. కేవలం నాలుగు పరుగులే
నవీన్ ఉల్ హక్ వేసిన తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి.
-
GT vs LSG: బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. క్రీజులోకి సాహా, గిల్
నవీన్ ఉల్ హక్.. తన తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
GT vs LSG: బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. జట్టు ఇదే
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(హార్ధిక్ పాండ్యా), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
-
GT vs LSG: లక్నో బౌలింగ్.. జట్టు ఇదే
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
-
GT vs LSG: టాస్ గెలిచిన గుజరాత్
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.