Last Updated:

Mumbai Indians: ముంబయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌.. రోహిత్‌ కి ఏమైంది?

Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.

Mumbai Indians: ముంబయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌.. రోహిత్‌ కి ఏమైంది?

Mumbai Indians: ఐపీఎల్ సీజన్ లో ముంబయి జట్టుకి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ జట్టులో ఉన్నా.. సూర్య కుమార్ ముంబయి జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి రోహిత్ శర్మకి ఏమైందో తెలుసా?

సూర్యకుమార్ కెప్టెన్.. (Mumbai Indians)

ఐపీఎల్ సీజన్ లో ముంబయి జట్టుకి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ జట్టులో ఉన్నా.. సూర్య కుమార్ ముంబయి జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి రోహిత్ శర్మకి ఏమైందో తెలుసా?

ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది. వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోష్‌ మీద ఉన్న ముంబై.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. తమ సొంత మైదానం వాంఖడేలో శనివారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.

అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా సూర్య కుమార్ ఉండనున్నాడు. రోహిత్ శర్మ.. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్‌ కారణంగా రోహిత్‌ విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్‌.. పియూష్‌ చావ్లా స్ధానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.

అతడి స్థానంలో సూర్యకుమార్‌ నాయకత్వం వహించాడు. ఇప్పుడు కూడా ఇదే సీన్‌ రిపీట్‌ చేయాలని ముంబై మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా రోహిత్‌ కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఈ టోర్నీ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక పంజాబ్‌తో మ్యాచ్‌కు ముంబై స్పీడ్‌ స్టార్‌ జోఫ్రా అర్చర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన అ‍ర్చర్‌ ప్రస్తుతం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.