Last Updated:

Mohammad Shami: ఆ టీ20 సిరీస్కు షమీ దూరం… ఎందుకంటే..!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ దూరమయ్యారు. కరోనా కారణంగా అతను ఈ సిరీస్ కు దూరం కాగా అతని ప్లేస్లో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు.

Mohammad Shami: ఆ టీ20 సిరీస్కు షమీ దూరం… ఎందుకంటే..!

Mohammad Shami: టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ దూరమయ్యారు.

టీం ఇండియా సీనియర్ బౌలర్ షమీ కరోనా బారినపడ్డాడు. దీనితో ఆస్ట్రేలియాతో సోమవారం నుంచి ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షమీ దూరమయ్యాడు. షమీ స్థానంలో మరో బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు జట్టులో ప్లేస్ దొరికింది.

అంతర్జాతీయ టీ20.. ఫార్మాట్‌లో షమీ తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనపరచడం వల్ల ఆసిస్‌తో సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. ఈ 32 ఏండ్ల పేసర్‌ గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా, ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ 20 వరల్డ్‌ కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు కూడా షమీ ఎంపికయ్యాడు. అయితే అతడిని స్టాండ్‌బై ప్లేయర్‌గా అంటే ఒక బౌలర్ గాయపడితే, షమీని ప్రధాన జట్టులోకి తీసుకుంటారు.

ఇదీ చదవండి: Gautam Gambhir: ఆస్ట్రేలియాను ఓడించకపోతే భారత్ ప్రపంచ కప్ గెలవదు.. గౌతమ్ గంభీర్

ఇవి కూడా చదవండి: