Last Updated:

Shaakuntalam Movie Review : సమంత “శాకుంతలం” సినిమా రివ్యూ, రేటింగ్.. ఎలా ఉందంటే ?

Shaakuntalam Movie Review : సమంత “శాకుంతలం” సినిమా రివ్యూ, రేటింగ్.. ఎలా ఉందంటే ?

Cast & Crew

  • దేవ్ మోహ‌న్ (Hero)
  • స‌మంత (Heroine)
  • మోహ‌న్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిష్షు సేన్ గుప్తా తదితరులు (Cast)
  • గుణశేఖర్ (Director)
  • నీలిమా గుణ (Producer)
  • మణిశర్మ (Music)
  • శేఖర్ వి. జోసెఫ్ (Cinematography)
2

Shaakuntalam Movie Review : సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. మోహ‌న్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిష్షు సేన్ గుప్తా తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. మైథలాజికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.  రుద్రమదేవి తర్వాత గుణశేఖర్‌ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఇక ఈ సినిమాను ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. గుణ శేఖ‌ర్‌ ఈ సినిమాని తీశాడు. కాగా భారీ అంచనాల నడుమ నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి మేనక (మధుబాల)ను ఇంద్రుడు భూలోకానికి పంపిస్తాడు. తపస్సు భంగం కావడమే కాకుండా వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటి అవుతారు. ఫలితంగా మేనక ఓ అమ్మాయికి జన్మ ఇస్తుంది. ఆ చిన్నారిని భూలోకంలో వదిలి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అడవిలో చిన్నారిని చూసిన కణ్వ మహర్షి శకుంతల అని పేరు పెట్టి కన్న బిడ్డలా పెంచుతాడు. శకుంతల పెద్దది అవుతుంది. ఓ రోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్).. శకుంతల (సమంత)ను చూస్తాడు. ఒకరిపై మరొకరు మనసు పడతారు.  గంధర్వ వివాహం చేసుకుని శారీరకంగానూ కలుస్తారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత సకల రాచ మర్యాదలతో ఆహ్వానించి, మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని చెబుతాడు.

తాను సకల రాచ మర్యాదలతో తన పట్టపు మహారాణిగా శకుంతలని తీసుకెళ్తానని, తన రాజ్య ప్రజలకు పరిచయం చేస్తానని చెబుతాడు. తమ ప్రేమిక చిహ్నంగా ఆమెకి తన ఉంగరాన్ని ఇస్తాడు. యాగం పూర్తి చేసుకుని వచ్చిన కణ్వ మహర్షి ఈ విషయం తెలిసి సంతోషిస్తాడు. అయితే రోజులు గడుస్తున్నా దుష్యంతుడు రాడు, ఈ లోపు శకుంతల గర్భవతి కూడా అవుతుంది. సమయం మించి పోతున్న నేపథ్యంలో కణ్వ మహర్షి.. ఓ ఉత్తరం రాస్తూ శకుంతలని దుష్యంతుడి వద్దకి పంపిస్తాడు. రాజ్యానికి చేరిన శకుంతలని చూసిన దుష్యంతుడు ఆమె ఎవరో తెలియదని, తాను మొదటిసారి చూస్తున్నానని చెప్పడంతో శకుంతల ఖంగుతింటుంది. దీంతో అతను ఇచ్చిన అంగుళికాన్ని చూపించేందుకు ప్రయత్నించగా, అది ఎక్కడో జారిపోతుంది. మరి శకుంతలని దుష్యంతుడు ఎందుకు గుర్తుపట్టలేదు? అతడు ఎందుకు అలా చెప్పాడు? నిండు సభలో శకుంతలకు జరిగిన అవమానం ఏమిటి? ఆ రాజ్య ప్రజలు శకుంతలని ఎందుకు చంపాలనుకుంటారు? గర్భవతిగా ఉన్న శకుంతల.. వారి నుంచి ఎలా తప్పించుకుంది?  దుర్వాసుడు(మోహన్‌బాబు) శకుంతలని ఎందుకు శపించాడు? ఇంతకి శకుంతులని దుష్యంతుడు స్వీకరించాడా? లేదా? ఆ తర్వాత ఏమైంది?  అనేది సినిమా.

మూవీ విశ్లేషణ (Shaakuntalam Movie Review).. 

భారతీయ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ ‘శాకుంతలం’ సినిమా.. శకుంతల – దుష్యంత మహారాజుల ప్రేమ కథని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రారంభం నుంచే శకుంతల పాత్రకి సమంత సూట్ అవ్వలేదనే వాదన వినిపిస్తుంది. ఇక వెండితెరపై సామ్ ని చూశాక కూడా ఇదే డౌట్ వస్తుంది. ఇక అందరికీ తెలిసిన కథనే.. అందరూ మెచ్చేలా తీయగలగడం కత్తి మీద సాములాంటిదే.  అందులోనూ ఎటువంటి మలుపులు లేని అభిజ్ఞాన శాకుంతలం కథను యథాతథంగా తీయాలనుకున్నప్పుడు.. ప్రతి సన్నివేశం ఓ దృశ్య కావ్యం అన్నట్లు ఉంటే తప్ప ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. కానీ గుణశేఖర్ గత చిత్రం రుద్రమదేవికి చేసిన తప్పే ఈ సినిమాలోనూ రిపీట్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అసలు ఈ సినిమాను ‘త్రీడీలో ఎందుకు చూపిస్తున్నారు ? టూడీలో చూపిస్తేనే బావుండేది ఏమో అనే సందేహం అందరికీ కలుగుతుంది.

విజువల్ ఎఫెక్ట్స్ & త్రీడీ వర్క్ పట్ల మరింత శ్రద్ద పెట్టాల్సింది. ఇవే సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి. దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి. రణభూమిలో యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి. దేవ్ మోహన్ బదులు తెలుగు హీరో ఎవరినైనా తీసుకుని ఉంటే బావుండేది. సమంత కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. సమంతను చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఇదీ మింగుడుపడని అంశమే. శకుంతల, దుష్యంతుల ప్రేమకథని చెప్పాలనుకున్నారు. శృంగార కథగా ఉన్నదాన్ని భావోద్వేగాల అంశాలు ప్రధానంగా చూపించాలనుకున్నారు. లవ్‌ స్టోరీ రొటీన్‌ అవుతున్న నేపథ్యంలో ఎమోషన్స్ ప్రధానంగా సినిమాని చూపించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. మణిశర్మ స్వరాలు మధ్య మధ్యలో మనసుకు ఊరట కలిగించాయి. ఆయన సంగీతం కాస్త స్వాంతన చేకూర్చింది. నిర్మాతలు ఖర్చు పెట్టినట్టు తెరపై సన్నివేశాలు చూస్తే కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరే అయినట్లు తెలుస్తుంది.

నటీనటులు ఎలా చేశారంటే..

సమంత శకుంతల పాత్రకు సూటవ్వలేదని అనిపిస్తుంది. కానీ తన పాత్రలో మాత్రం జీవించేసింది. దేవ్ మోహన్ రూపం బావుంది కానీ నటన అంతాగా బాలేదు అని టాక్. దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు కాసేపు కనిపించి సన్నివేశాలకు ప్రాణం పోశారు. పతాక సన్నివేశాల్లో శకుంతల, దుష్యంతుల కుమారుడిగా అల్లు అర్హ కనిపించారు. ఆ చిన్నారి నటన ముద్దొస్తుంది. తెలుగు డైలాగులను అర్హ చక్కగా చెప్పింది. ఇక మేనకగా మధుబాలను, గౌతమి, అనన్య నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖేడేకర్ సహా చాలా మంది తారాగణం ఉన్నా కానీ వారి పాత్రలకు అంత ప్రాధాన్యత లేదు.

కంక్లూజన్.. 

మళ్ళీ సేమ్ సీన్ రిపీట్.. అప్పుడు రుద్రమదేవి .. ఇప్పుడు శాకుంతలం

 

ఇవి కూడా చదవండి: