Kannappa : మంచు విష్ణు “కన్నప్ప” న్యూ అప్డేట్.. అదిరిపోయే లుక్ తో ఫస్ట్ పోస్టర్ రిలీజ్
Kannappa :టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో
Kannappa : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ గా నిలిచిన మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటించబోతున్నట్టు ప్రకటించారు.ఇక ఈ సినిమాకి అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెచా’ వర్క్ చేస్తున్నారు. అప్పట్లో వాడిన ఆయుధాలు ,పోరాటాల నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కన్నప్ప సినిమా నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా నేడు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో ‘కన్నప్ప’ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023
ఈ పోస్టర్ (Kannappa) లో అడవుల్లో మంచు విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు వేస్తున్నాడు. వెనుక కొండలు, జలపాతాలతో శివలింగం ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు. దీంతో పోస్టర్ లుక్ అదిరిపోయింది. కన్నప్ప టైటిల్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశారు. దేవుడ్ని నమ్మని ఓ వేటగాడు శివుడిని ఎదిరించి ఆ తరువాత వీర భక్తుడిగా ఎలా మారాడు అని అర్ధం వచ్చేలా ఓ సబ్ టైటిల్ కూడా ఇచ్చారు. దీంతో మంచు విష్ణు కన్నప్ప పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ కన్నప్ప పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి, పాన్ ఇండియా సినిమాగా కన్నప్ప వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుందని సమాచారం. ఈ సినిమా కోసం విష్ణు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు .