Brahmastra Twitter Review: బ్రహ్మాస్త్ర సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది !

  • Written By:
  • Updated On - September 9, 2022 / 04:38 PM IST

Cast & Crew

  • రణ్‌బీర్ కపూర్ (Hero)
  • ఆలియా భట్ (Heroine)
  • అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున (Cast)
  • అయాన్ ముఖర్జీ (Director)
  • కరణ్ జోహార్,అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా (Producer)
  • ప్రీతమ్ (Music)
  • వి. మణికందన్ , పంకజ్ కుమార్ (Cinematography)
3

Brahmastra Review: బాలీవుడ్ స్టార్ జంట నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ  సినిమాకు అయాన్ ముఖర్జీ  దర్శకత్వం వహించారు. విజువల్ ప్రపంచం ఈ సినిమాలో  కొత్తగా సృష్టించినట్టుగా మనకి కనిపిస్తుందనడంలో  ఏ మాత్రం సందేహం లేదు. అంతే  కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అందాల భామ మౌని రాయ్, డింపుల్ కపాడియా, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున  కీలక పాత్రల్లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రావడం వలన ఈ  సినిమా  మీద అంచనా భారీగా పెరిగింది. తెలుగులో ఈ  సినిమా “బ్రహ్మాస్త్రం ” తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొత్తం మూడు పార్ట్ లుగా ఉంటుందని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేడు బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్  ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ఈ సినిమా పాన్ ఇండియాగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు విడుదల అయింది. ఈ సినిమా పై ట్విట్టర్‌లో ప్రేక్షకుల  రెస్పాన్స్  ఎలా ఉందో చదివేద్దాం. బ్రహ్మాస్త్ర సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నదా ? లేదా ? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ట్విట్టర్‌లో ఒక వైపు ఈ సినిమా బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్నా బ్రహ్మాస్త్రం సినిమాకు మనం ఊహించునట్టుగానే పాజిటివ్ టాక్ వస్తుంది. కొంతమంది సినిమా చూసి వాళ్ళ జెన్యూన్ రివ్యూ ట్వీట్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్రం సినిమాకు కొత్త విజువల్ ఎఫ్ఫెక్ట్స్ వాడి ఈ సినిమాని చిత్రీకరించారని అయాన్ ముఖర్జీని ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు. ఈ సినిమా కథ చూడటానికి చిన్నదే  ఐనా విజువల్ ఎఫెక్ట్స్‌తో స్క్రీన్ పై చూడటానికి అందంగా చూపించారని ప్రేక్షకులు  చెప్తున్నారు.

సినిమా మొదటి నుంచి శుభం వరకు  క్లాస్ గా  ఉందని,  అయాన్ ముఖర్జీ  చెప్పినట్టుగానే  కథ చాలా  బావుందని , ఇంత మంచి కథ మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు అభినంధనాలు తెలుపుతున్నారు. ఈ సినిమాలో  ఆలియా భట్‌,  రణ్‌బీర్ నటన అందరిని  ఆకట్టుకుందని, సినిమాలో  ట్విస్ట్ లు మీద ట్విస్ట్లు మనం చూసే కొద్ది కనిపిస్తాయని ,  ఈ సినిమా రెండో పార్ట్ కూడా తొందరగా విడుదల చేస్తే  బావుండని కామెంట్స్ చేస్తున్నారు.

బ్రహ్మాస్త్రం సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో  ఈ  చిత్రబృందం వాళ్ళ  సంతోషాన్ని బయటికి వ్యక్తం చేస్తున్నారు. రణ్‌బీర్, ఆలియా భట్ అభిమానులు థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత బాలీవుడ్‌లో ఒక  హిట్ సినిమా వచ్చిందని సినిమా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సినిమా టాక్  ఐతే బాగానే ఉన్నప్పటికి, సినిమా కలెక్షన్లు కూడా అదే రేంజులో వసూళ్లు చేస్తుందో లేదో చూడాలిసి ఉంది. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే “బ్రహ్మాస్త్ర ” ప్రేక్షకుల అంచనాలను అందుకొని హిట్ కొట్టిందనే చెప్పుకోవాలి.