Last Updated:

union minister narayana swamy: కేసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ విమర్శలు

బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నారాయ‌ణ స్వామి సీఎం కేసిఆర్ జాతీయ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై వ్యంగ విమ‌ర్శ‌లు గుప్పించారు.

union minister narayana swamy: కేసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ విమర్శలు

New Delhi:  సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా అంటూ కేంద్ర మంత్రి కేసిఆర్ ను ప్రశ్నించారు. ఎంపీ సీట్ల‌న్నీ గెలిచి ప్ర‌ధాని కావాల‌న్న పిచ్చి క‌ల‌లు వ‌దిలేయాలి అని సూచించారు. రాష్ట్రంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన తర్వాత జాతీయ పార్టీ పెట్టాలంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఓ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా కేసీఆర్ జాతీయ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై నారాయ‌ణ స్వామి ఘాటుగా స్పందించారు. ప్ర‌తి ఒక్క‌రు ఒక ఇండిపెండెంట్‌గానో, స్టేట్ పార్టీగానో ఏడెనిమిది ఎంపీ సీట్ల‌ను గెలిచి ప్ర‌ధాని అయిపోవాల‌నుకుంటే సాధ్య‌ప‌డుతుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ దిశ‌గా కేసిఆర్ చేస్తున్న ఆలోచ‌న‌ల‌న్నీ పిచ్చి ఆలోచ‌న‌లేన‌ని ఆయ‌న అన్నారు.

ఇవి కూడా చదవండి: