Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 30 న వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళ సై ను ఆహ్వానించకపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
Talasani Srinivas: నంది అవార్డులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నంది అవార్డుల విషయంలో.. వివాదం నడుస్తోంది. తాజాగా ఈ అవార్డులపై మంత్రి తలసాని స్పందించారు.
BRS office: దిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత.. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘనంగా ప్రారంభించారు.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్‌లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు.
బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించగా.. వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
అజిత్ పవార్.. ఎన్సీపీని వీడి బీజేపీ చేరతారనే ఊహాగానాల మధ్య పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Bengaluru: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం కోసం వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాఫ్టర్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. కాగా, శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ కు […]
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.