Last Updated:

Uttar Pradesh: రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు

ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్రేటర్ నోయిడాలోని మూడంతస్తుల ఇంటిలో విదేశీయులు ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీని ఛేదించారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి 46 కిలోల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు.

Uttar Pradesh: రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు

 Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్రేటర్ నోయిడాలోని మూడంతస్తుల ఇంటిలో విదేశీయులు ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీని ఛేదించారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి 46 కిలోల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు.

విలువైన డ్రగ్స్‌.. ( Uttar Pradesh)

అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 200 కోట్ల విలువైన 46 కిలోల మెథమెటాహైన్ (ఎండీఎంఏ)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ తెలిపారు.100 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, ముడిసరుకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.మెథాంఫెటమైన్ తెలుపు, స్వచ్ఛమైన రూపంలో ఉంది. తొమ్మిది మంది విదేశీయులు గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ తీటా 2లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు అని సింగ్ చెప్పారు. మెథాంఫెటమైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆమె తెలిపారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని పలు సెక్షన్ల కింద విదేశీ పౌరులపై కేసు నమోదు చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అంతకుముందు నవంబర్ 2021లో గుజరాత్ పోలీసులు ద్వారకా జిల్లాలో రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.