Last Updated:

Pune: ఈ వ్యాపారి ఆలోచన అదుర్స్.. ఈఎంఐల్లో మామిడి పండ్లు

వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది.. అందరూ ఎంతగానో ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. అయితే రాను రాను వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Pune: ఈ వ్యాపారి ఆలోచన అదుర్స్..  ఈఎంఐల్లో మామిడి పండ్లు

Pune: సాధారణంగా ఈఎంఐలు అనేవి ఎలాంటి వాటికి పెట్టుకుంటాం.. టీవీలు, ఫోన్లు, ఏసీలు, కార్లు.. ఇలా కాస్ట్ లీ వస్తువులను ఈఎంఐలు ద్వారా కొనుగోలు చేస్తుంటాం. పండ్లలో రారాజు మామిడి వేసవిలో సీజన్‌లో మాత్రమే లభించే అద్భుతం. మరి, ఈ మామిడి పండ్లను ఎప్పుడైనా వాయిదా పద్దతిలో కొన్నారా? ఈఎంఐల్లో మామిడి పండ్లా అనుకుంటున్నారు కదా.. అవును మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారి వెరైటీగా మామిడి పండ్లకు ఈఎంఐ ఆఫ్షన్లు పెట్టాడు.

వినూత్న ఆలోచనతో..(Pune)

వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది.. అందరూ ఎంతగానో ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. అయితే రాను రాను వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని సింధ్ దుర్గ్ జిల్లాలోని దేవగఢ్, రత్నగిరి జిల్లాల్లో విరివిగా దొరికే ఆల్ఫోన్జో రకం మామిడి పండ్ల డిమాండ్ బాగా ఉంటుంది. దీంతో వాటి రేట్లు కూడా భారీగా ఉంటున్నాయి. రిటైల్ మార్కెట్ ఆల్ఫోన్జో డజను కొనాలంటే రూ. 800 నుంచి రూ. 1300 వరకు ఉంటుంది. దీంతో పుణెకు చెందిన గౌరవ్ సనాస్ అనే వ్యాపారి అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు.

 

కండిషన్లు అప్లై

తమ షాపుల్లో మామిడి పండ్లను వాయిదా పద్దతిలో తీసుకోవచ్చని ఓ ప్రకటన విడుదల చేశాడు. అయితే, దీనికి కొన్ని కండిషన్స్ పెట్టాడు. మామిడి పండ్లను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. అంతేకాకుండా కనీసం రూ. 5 వేలు అంతకంటే ఎక్కువ ఖరీదు చేయాల్సి ఉంటుంది. ఇలా అయితేనే ఈఎంఐ సదుపాయం ఉంటుంది. ఈ ఆఫర్ కోసం సదురు వ్యాపారి పేటీఎం స్వైప్ మిషన్ ను వినియోగిస్తున్నారు. కస్టమర్ మామిడి పండ్లను కొన్న తర్వాత క్రెడిట్ కార్డుతో ఈ మిషన్ లో స్వైప్ చేసి బిల్లు తీసుకుంటున్నారు. అప్పుడు మిషన్ లో ఈఎంఐ ఆఫ్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే బిల్లును 3,6,12 నెలల్లో వాయిదాల్లో చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ‘ ఈ పండ్ల ధర కారణంగా అందరికీ అందుబాటులో ఉండాలని ఈఎంఐ ఆఫర్ తీసుకొచ్చాను’ అని వ్యాపారి చెప్పారు.