Home / జాతీయం
వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీపై మరో రాష్ట్రంలో కూడా నిషేధం వేటు పడింది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం శాంతిభద్రతలని కారణంగా చూపిస్తూ నిషేధం విధించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ సారి రాహుల్ గతంలో మాదిరి కాకుండా భిన్నంగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి మెగ్గు చూపారు.
శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిహార్ జైలులో ఉన్న శరత్‌చంద్రారెడ్డి.. తన భార్య అనారోగ్యం దృష్ట్యా..
: ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (PM CARES ఫండ్) గత మూడేళ్లలో విదేశీ విరాళాలుగా రూ. 535.44 కోట్లు అందుకుంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో PM CARES ఫండ్ 2020లో ఏర్పాటు చేయబడింది.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఆనంద్ మోహన్, బీహార్ జైలు నిబంధనల సవరణతో గత నెలలో సహర్సా జైలు నుంచి బయటకు వచ్చారు.
కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్బంగా శనివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
Airtel: భారతదేశంలో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకి పెరుగుతుంది. దీంతో యూజర్లకు అనుగుణంగా.. టెలికాం సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
మణిపుర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా మణిపుర్ రాజధాని ఇంఫాల్ నుంచి విద్యార్థులను శంషాబాద్ తీసుకొచ్చారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయవద్దని రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పంజాబ్ రైతులకు సూచించారు. పంజాబ్‌కు చెందిన రైతులు సోమవారం కిసాన్ యూనియన్ నాయకులు పోలీసు బారికేడ్లను ఛేదించారు.
MiG 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.