Home / జాతీయం
గత వారం శుక్రవారం బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్పి) స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 337, 338, 304A (నాన్-బెయిలబుల్) & 34 కింద కేసు నమోదు చేయబడింది, ఇందులో "నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలు" మరియు రైల్వే చట్టంలోని 153, 154 & 175 అభియోగాలు ఉన్నాయి.
క్యాష్ అడ్వాన్స్’ అనే మోసపూరిత లోన్ యాప్‌ను ఉపయోగించి దేశవ్యాప్తంగా 1,977 మందికి పైగా 350 కోట్ల రూపాయల మేర మోసగించిన ముఠాను ఛేదించడంలో ఢిల్లీ పోలీసులు విజయం సాధించారు. IFSO (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్స్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ఈ ముఠాను ఛేదించింది
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం ఆప్ నేత మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది.తన భార్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు.
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ స్కామ్‌కు సంబంధించి ఆమెను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ సీజన్లో చార్ ధామ్ యాత్రను సందర్శించిన యాత్రికుల సంఖ్య 20 లక్షలు దాటింది. దీనిలో కేదార్నాథ్ ధామ్ కు 7.13 లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ పెను విషాదంలో 270 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు కొనసాగిస్తున్న నిరసన నుంచి సాక్షి మాలిక్ విరమించుకున్నారు. ఆమె ఉత్తర రైల్వేలో తన ఉద్యోగంలో తిరిగి చేరింది. రెజ్లర్లు శనివారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షాను కలిసిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
మన దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్ టాప్ లో ఉండటం వరుసగా ఐదో సారి. అదే విధంగా ఉత్తమ యూనివర్పిటీల ర్యాంకింగ్స్ లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్ఠానాన్ని కైవసం చేసుకుంది.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో లంపి చర్మవ్యాధి ( ఎల్ఎస్డి) కలకలం రేపుతోంది. లంపి స్కిన్ డిసీజ్ అనేది ఆవులు మరియు గేదెలలో ఒక అంటు వ్యాధి. ఇది పశువుల మరణాల రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో ఇప్పటివరకు మొత్తం 571 జంతు మరణాలు నమోదయ్యాయి.
32 ఏళ్ల నాటి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ 1991లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు అవదేశ్ రాయ్ ను హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.