Home / జాతీయం
బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఉచితంగా ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ 14 తో గడువు ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూఐడీఏఐ ( భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసేందుకు అవకావం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
బెంగళూరులో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది, 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసి సూట్‌కేస్‌లో కుక్కి మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలేకహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సేనాలి సేన్ అనే నిందితురాలు ఆవేశంతో తన 70 ఏళ్ల తల్లి బీవా పాల్‌ను హత్య చేసింది.
సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను మూసివేస్తామని భారతదేశం బెదిరించిందని పేర్కొన్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై కేంద్రం ఎదురుదాడి చేసింది. 2021లో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సే, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలను, రైతుల నిరసనలపై నివేదించే వారి ఖాతాలను సెన్సార్ చేయమని, అలాగే ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తామని భారతదేశం నుండి బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.
బిపర్ జోయ్ తుఫాను దృష్ట్యా గుజరాత్‌లోని సౌరాష్ట్ర మరియు కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ ( ఐఎండి) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 15 సాయంత్రానికి బిపర్ జోయ్ తుఫాను జఖౌ పోర్ట్ ప్రాంతాన్ని దాటే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. నామినేషన్ సెంటర్ల వద్ద సెక్షన్ 144 సెక్షన్ విధించాలని అధికారులను ఆదేశించింది.
: బైక్-టాక్సీ అగ్రిగేటర్లు రాపిడో మరియు ఉబర్లను దేశ రాజధానిలో ఆపరేట్ చేయడానికి తప్పనిసరిగా అనుమతించాలన్న హైకోర్టు ఆదేశాలపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త విధానాన్ని రూపొందించే వరకు వారిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.
దేశంలో మూడు రకాల ఆన్లైన్ గేమ్‌లను ప్రభుత్వం అనుమతించదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. నిషేధించబడే మూడు రకాల గేమ్‌లలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ మరియు వ్యసనానికి సంబంధించిన గేమ్‌లు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.ఆన్లైన్ గేమింగ్ కోసం ప్రభుత్వం తొలిసారిగా ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసిందన్నారు.
పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర మరియు రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుని విడుదల చేయాలని కోరుతూ హర్యానా రైతులు ఢిల్లీ-హర్యానా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.
మద్యప్రదేశ్ లో 220 నెలల భారతీయ జనతా పార్టీ పాలనలో 225 స్కామ్‌లు జరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.సోమవారం మధ్యప్రదేశ్‌లో ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని జబల్పూర్లో ర్యాలీతో ఆమె ప్రారంభించారు.