Home / జాతీయం
పశ్చిమ బెంగాల్‌లోని మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రూప్ డి మరియు గ్రూప్ సి సేవల కింద ఉన్న ఉద్యోగాలకు రేటు పెట్టి అమ్ముకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడయింది.
కోవిన్ పోర్టల్ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న వారి వివరాలు లీకయినట్టు తెలుస్తోంది. ప్రముఖుల ఆధార్, పాన్ , ఓటర్ ఐడీ కార్డుల సమాచారం మొత్తం టెలిగ్రామ్ లో ప్రత్యక్షం అయింది. తమిళనాడు ఎంపీ కనిమొళి, కార్తీ, పి. చిదంబరం, కేటీఆర్, హర్షవర్ధన్ ల సమాచారం టెలిగ్రామ్ లో దుండగులు అప్లోడ్ చేశారు. దాంతో తృణముల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) ఎమ్మెల్యే రూపకళ ఆదివారం ప్రభుత్వ బస్సులలో మహిళల కోసం ఉచిత బస్సు సర్వీస్ స్కీమ్ ‘శక్తి యోజన’ ప్రారంభోత్సవం సందర్భంగా కెఎస్ఆర్టిసి బస్సును నడిపారు. ఈ పథకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించి నర్మదా పూజలు చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఉన్నారు.కర్ణాటకలో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో లైట్లను అమర్చిన ఇనుప స్తంభం ప్రమాదవశాత్తూ మీదపడింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్జాయ్’ తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఈ తుపాను తీరం వైపు కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.